Home Page SliderTelangana

ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలి..

Share with

బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. రాజకీయ కుట్రలు సహించేది లేదని తేల్చి చెప్పారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన డీజీపీ జితేందర్ కు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో ఆ పార్టీ నేతలున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కుట్రలకు తెరలేపుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ, హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు యంత్రాంగంతో సమీక్షించాలని డీజీపీని సీఎం ఆదేశించారు.