అభిమానులకు శుభవార్త
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆస్కార్ అవార్డు నామినేషన్లలో ఈ సారి జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ఉండొచ్చని హాలీవుడ్‌కు చెందిన `వెరైటీ మ్యాగజైన్’ అంచనా వేసింది. RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించారు. ఈ పాత్రలో ఎన్టీఆర్ నటన అందరినీ ఆకట్టుకుంది.
ఇప్పుడు ఇదే పాత్రకు జూనియర్ ఎన్టీఆర్‌ను ఉత్తమ నటుడి ఆస్కార్ అవార్డు నామినేషన్లలోకి తీసుకోవచ్చేలా చేసిందని `వెరైటీ మ్యాగజైన్’ తెలిపింది. `ఆల్ కంటెండర్స్ లిస్ట్’ ఉత్తమ నటుడి కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు పొందుపరిచింది. RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించడంతోపాటు, భారీ వసూళ్లను తెచ్చిపెట్టింది. ఈ వార్త వినగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.