NewsTelangana

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్

Share with

మహిళల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకొచ్చింది. గర్భిణీల కోసం కెసిఆర్ న్యూట్రీషన్ కిట్ ను దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ కానుకగా ఇస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి హరీష్ రావు తెలిపారు. గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నారని ఇప్పటికే కేసీఆర్ కిట్టు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో వారికి పోషకాహారం కూడా అందించాలని నిర్ణయించింది. ఈ కేసీఆర్ పోషకాహార కిట్టును తొలుత వికారాబాద్, భూపాలపల్లి, గద్వాల, కొమురం భీం, ములుగు, అదిలాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లక్షన్నర మంది గర్భిణీ మహిళలకు అమలు చేస్తామని అధికారులు చెప్పారు.

ఈ కెసిఆర్ పోషకాహార కిట్టులో ఒక కిలో న్యూట్రిషనల్ మిక్స్ పౌడర్, ఒక కిలో ఖర్జూరం, మూడు బాటిల్ల ఐరన్ సిరప్, ఒక ఆల్బెండజోల్ మాత్ర, 1/2 కేజీ నెయ్యి, ఒక ప్లాస్టిక్ కప్పు ఉంటాయని హరీష్ రావు తెలిపారు. ఒక కిట్ విలువ రెండు వేల రూపాయ ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. మహిళా గర్భం దాల్చిన మూడో నెలలో, ఆరో నెలలో ఈ కిట్ ను లబ్ధిదారులకు అందిస్తామన్నారు.