NewsTelangana

ట్యాంక్ బండ్ పై మళ్లీ సండే ఫన్ డే

Share with

స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్ బండు పై సండే ఫన్ డే వేడుకలు జరగనున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించే ఈ వేడుకల్లో వేలాదిమంది పాల్గొనేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సమయంలో ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలను నిషేధించి ట్రాఫిక్ ఫ్రీగా మార్చారు. కరోనా వల్ల సండే ఫన్ డే కార్యక్రమాన్ని మూడేళ్ల క్రితం నిలిపేశారు. దాన్ని ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించారు.


ట్యాంక్ బండ్ పై ఉన్న బి ఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంతా త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. హుస్సేన్ సాగర్ తీరంలో నిత్యం ఎగురుతున్న జాతీయ పతాకం వద్ద భారీ లైటింగ్ ఏర్పాటు చేసి ట్యాంక్ బండ్ పై నుంచి సందర్శకులు తిలకించేట్లు చేశారు. హుస్సేన్ సాగర్ లో బోటింగ్ విన్యాసాలు కూడా ఉన్నాయి. సందర్శకులకు బోటింగ్ చేసే సౌకర్యం కూడా కల్పించారు. హుస్సేన్ సాగర్లో కొలువై ఉన్న బుద్ధ విగ్రహం త్రివర్ణ శోభితమైంది. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు నుంచి వచ్చేవారు తమ వాహనాలను ఎన్టీఆర్ స్టేడియం వద్ద పార్క్ చేయాలి. సికింద్రాబాద్ నుంచి వచ్చేవారు బుద్ధ విగ్రహం రోడ్డు, నెక్లెస్ రోడ్డు వద్ద పార్క్ చేయాలి.