HealthHome Page Slider

మీరు తినేది నల్ల ద్రాక్షనా లేక తెల్ల ద్రాక్షనా ? వీటిలో ఏది మంచిది?

సాధారణంగా పండ్లు ఏంతో రుచికరంగా ఉంటాయి. అలానే ఆరోగ్యకరణమైనవి కూడా. వాటిల్లో విటమిన్స్, ఫైబర్, గ్లూకోజ్ మొదలైనవి ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఖచ్చితంగా తినాలి.
ఎండాకాలం వస్తే చాలు మనం తీసుకునే పండ్లల్లో పుచ్చకాయ ముందు ఉంటుంది. దాంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరంజ్, ద్రాక్ష, ఖీరా మొదలైనవి చాలా మంచిది.
అయితే ద్రాక్షలలో రెండు రకాలు ఉంటాయి. అవి తెల్లగా అనగా ఆకుపచ్చ రంగులో మరియు నల్లగా ఉంటాయి. తెల్ల ద్రాక్షలో పొటాషియం, ఫైబర్, విటమిన్ K & C ఉంటాయి. అదీ కాకా ఇది హైబిపిని కూడా నియంత్రిస్తుంది. అంతే కాదు దీనిలో గ్లూకోస్ మరియు ఫ్రక్టోజ్ లు ఉంటాయి. అవి శరీరానికి శక్తిని అందిస్తాయి.
నల్ల ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనిలో విటమిన్ C & K మరియు పీచు పదార్ధం ఉంటుంది. నల్ల ద్రాక్షలో రెస్విరాట్రాల్ ఉంటుంది. ఇది కాన్సర్ ను దరిచేరకుండా కాపాడుతుంది.
నిపుణుల ప్రకారం ఈ రెండు రకాలు కూడా ఆరోగ్యానికి మంచిదే. ఎవరి అభిరుచుల్ని బట్టి వారు వీటిని తినొచ్చు.