క్రోమ్ వాడుతున్నారా..? వెంటనే ఈ పని చేయండి
గూగుల్ యూజర్స్‌కి కేంద్ర ప్రభుత్వం బిగ్ అలెర్ట్ ఇచ్చింది. గూగుల్ క్రోమ్ వాడేవారు తక్షణమే అప్‌డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది. ఎందుకంటే దానిలో రెండు వల్నరబిలిటీస్‌ను గమనించామని లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ అవకపోతే ప్రమాదమని పేర్కొంది. వీటి వల్ల రిమోట్ ఏరియాస్ నుండి కూడా సైబర్ క్రిమినల్స్ అటాక్ చేసే ప్రమాదముందని వార్నింగ్ ఇచ్చింది. ఒక ఆర్బిట్రారీ కోడ్‌ను పంపించి, సమాచారాన్ని దొంగిలించే అవకాశముందని హెచ్చరించింది.