Home Page SliderTelangana

బీ అలర్ట్.. మార్కెట్లో ఎక్స్ పైరి కూల్ డ్రింక్స్

ప్రజలు వేసవి దాహం తీర్చుకునే క్రమంలో కూల్ డ్రింక్ ఎక్స్ పైరి డేట్ చూసుకోకుండానే కొంటున్నారు. ఇదే అదునుగా భావించి వ్యాపారులు అమ్ముతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో కొందరు యువకులు ఓ షాపులో థమ్సప్, వాటర్ పాకెట్లు తీసుకున్నారు. ఆ కూల్ డ్రింక్ తాగిన తర్వాత వాంతులయ్యాయి. దీంతో ఆ డ్రింక్ గడువు తేదీని పరిశీలిస్తే 27-11-2024గా ఉంది. దీంతో దుకాణ యజమానిని నిలదీశారు. గడువు తీరిన మాట నిజమేనని, కానీ కూల్ డ్రింక్ తాగాక వాంతులు అయ్యాయి అనడం నమ్మలేనని సమాధానమివ్వడంతో యువకులు విస్మయానికి గురయ్యారు. ఈ విషయాన్ని తమ గ్రామ వాట్సాప్ గ్రూపులలో ప్రజలను అలర్ట్ చేశారు. ‘మన ఊరిలో ఎక్స్పైరీ డేట్ ముగిసిన కూల్ డ్రింక్ అమ్ముతున్నారు.. ఎవరైనా సరే కొనే ముందు చూసుకుని కొనండి’ అని సూచించారు.