Home Page SlidermoviesNationalNews Alert

వందల కోట్లు వదిలివెళ్లిన ఆశా!

దివంగత లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే నికర ఆస్తి విలువ సుమారు రూ. 200-250 కోట్లు ఉంటుందని అంచనా. తన 8 దశాబ్దాల సుదీర్ఘ గాన ప్రస్థానంలో ఆమె ఈ సంపదను కూడబెట్టారు. ఎక్కువగా స్థిరాస్థులు, వ్యాపారాలపై ఆమె ఎక్కువగా పెట్టుబడి పెట్టారట. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించారు. ఆశా భోంస్లే కేవలం పాడటమే కాదు, తన వంట ప్యాషన్‌ను కూడా బిజినెస్‌గా మార్చారు. ‘ఆశాస్’ పేరుతో ఆమె ఒక రెస్టారెంట్ చైన్‌ను ప్రారంభించారు. ఇది దుబాయ్, యూకే, గల్ఫ్ దేశాల్లో విస్తరించి ఉంది. దీని ద్వారా కూడా ఆమెకు భారీగా ఆదాయం వస్తుంది. పాటలతోపాటు నిరంతరంగా ఆమెకి ఈ ఆదాయం వస్తుంది. ఆశా భోంస్లేకు ముంబై, పుణె నగరాల్లో పలు విలాసవంతమైన బంగ్లాలు ఉన్నాయి. వాటి మొత్తం విలువ సుమారు రూ. 80-100 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె లైఫ్‌ స్టయిల్‌ కూడా అంతే లగ్జరీగా ఉంటుంది.  ఆశా భోంస్లే తన కెరీర్‌లో ప్రపంచవ్యాప్తంగా లైవ్ కాన్సర్ట్‌లు చేశారు. దుబాయ్, అమెరికా, కెనడా, ట్రినిడాడ్ వంటి దేశాల్లో ఆమె చేసిన షోలు లక్షలాది మంది అభిమానులను ఉర్రూతలూగించాయి. ఆమె గాత్రం మ్యాజిక్ ప్రతిచోటా వ్యాపించింది.