Andhra PradeshHome Page Slider

నాడు-నేడు అసంపూర్తి పనులతో ప్రమాదం

Share with

అసంపూర్తిగా నిలిచిన నాడు-నేడు పనులు తొమ్మిదేళ్ల బాలుడి ఊపిరి తీశాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట దుర్గా కాలనీలోని ప్రాథమిక పాఠశాల నాలుగో తరగతి విద్యార్థి తులసి సిద్ధుప్రసన్న (9) పై సోమవారం సిమెంటు పలకపడటంతో చనిపోయాడు.

పాయకరావుపేట: అసంపూర్తిగా నిలిచిన నాడు నేడు పనులు తొమ్మిదేళ్ల బాలుడి ఊపిరి తీశాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట దుర్గా కాలనీలోని ప్రాథమిక పాఠశాల నాలుగో తరగతి విద్యార్థి తులసి సిద్ధుప్రసన్న (9) పై సోమవారం సిమెంటు పలకపడటంతో చనిపోయాడు. ఈ పాఠశాలలో నాడు-నేడు పనుల్లో భాగంగా అదనపు గదులను నిర్మిస్తున్నారు. వీటిపక్కనే మరుగుదొడ్డి నిర్మించి తలుపు ఏర్పాటు చేయలేదు.

టాయ్‌లెట్ లోపలకు ఎవరూ వెళ్లకుండా అడ్డుగా ఐదడుగుల పొడవు, రెండడుగుల వెడల్పుతో సిమెంట్ పలకను ఏర్పాటు చేశారు. అది పడిపోకుండా కర్రలను అడ్డుపెట్టారు. మధ్యాహ్న భోజనమయ్యాక సిద్ధు ఫ్రెండ్స్‌తో స్కూల్ ఆవరణలో ఆడుతుండగా.. ప్రమాదవశాత్తు కర్రలు జారి సిమెంట్ పలక బాలుడి తలపై పడింది. టీచర్లు బాలుడిని వెంటనే తుని గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దుర్గా కాలనీలో నివసించే సతీష్, వీరమణి దంపతుల ఇద్దరి సంతానంలో సిద్ధు నాలుగో తరగతి చదువుతున్నాడు. పాప దుర్గాభవాని రెండో తరగతి చదువుతోంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.