సెప్టెంబర్ 7 నుండి కాంగ్రెస్ జోడో యాత్ర
సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్రను ప్రారంభిచనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. 150 రోజుల్లో 12 రాష్ట్రాల మీదుగా కాశ్మీర్ చేరుకోవడంతో ఈ జోడోయాత్ర ముగుస్తుంది. పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈ యాత్రకు ఇన్ చార్జిగా వ్యవహరించనున్నారు. దాదాపు 3,500 కిలో మీటర్ల మేర సాగే ఈ యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా పాల్గొంటారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేశారు. 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ యాత్రను ప్రారంభించబోతోంది. ఈ యాత్ర వల్ల తమ పార్టీకి ఎంతో మేలు చేకూరుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.