అమెజాన్ ‘ఆమ్-ఎజింగ్’ (Aam-azing) సేల్
నోరూరించే మామిడి రుచులను వినియోగదారులకు చేరువ చేసేందుకు ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ‘ఆమ్-ఎజింగ్’ (Aam-azing) పేరిట ప్రత్యేక విక్రయాలను ప్రారంభించింది. కేవలం పండ్లే కాకుండా, మామిడి ఆధారిత ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. పైగా ఈ మామిడి పళ్ల షాపింగ్ కోసం ఏఐ సలహాలనూ అందిస్తోంది. ఈ సీజన్ షాపింగ్‌లో ప్రధాన ఆకర్షణ అమెజాన్ వారి సరికొత్త ఏఐ షాపింగ్ అసిస్టెంట్ ‘రూఫస్’. “స్మూతీకి ఏ రకం బాగుంటుంది?” లేదా “బడ్జెట్‌లో బెస్ట్ డీల్స్ ఏవి?” వంటి ప్రశ్నలకు రూఫస్ వెంటనే స్మార్ట్ సలహాలు ఇస్తుంది. అంతేకాక గత 30 నుండి 90 రోజుల ధరల చరిత్రను విశ్లేషించి, వినియోగదారులకు సరైన డీల్ లభిస్తుందో లేదో రూఫస్ తెలియజేస్తుంది. ధర తగ్గినప్పుడు అలర్ట్లు కూడా పంపుతుంది. అల్ఫోన్సో, కేసర్, సఫేదా, తోతాపురి వంటి రకాలను నేరుగా పొలాల నుండి సేకరించి అమెజాన్ ఫ్రెష్ ద్వారా విక్రయిస్తోంది. మామిడి ఐస్‌క్రీములు, ఆమ్రస్, ఊరగాయలు, పానీయాలపై 30శాతం నుండి 70శాతం వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఎంపిక చేసిన ప్రాంతాలకు నిమిషాల వ్యవధిలోనే, లేదా గరిష్టంగా 2 గంటల్లోపు డెలివరీ చేసే సదుపాయం కల్పించింది. సాంకేతికతను (AI) జోడించి మామిడి పండ్ల విక్రయాలను అమెజాన్ సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది. ప్రీమియం అల్ఫోన్సో రకాలు, వంటల కోసం తోతాపురి, పాత జ్ఞాపకాలను గుర్తెచ్చే ఆమ్రస్, క్యాండీలు, ఫ్రీజ్ డ్రైడ్ చిప్స్, ప్రోటీన్ షేక్స్, మామిడి పానీయాలు, పల్ప్ వంటి అమ్మకాలతో జోరుగా దూసుకుపోతోంది. షాపింగ్‌ను మరింత స్మార్ట్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ సేల్ కొనసాగుతోంది.

