NewsTelangana

మూడేళ్ల చిన్నారికి హెచ్‌ఐవీ.. బ్లడ్‌ బ్యాంకుపై కేసు

Share with

హైదరాబాద్‌లో ఓ దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల చిన్నారికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఓ బ్లడ్‌ బ్యాంకుపై కేసు పెట్టారు. తలసేమియాతో బాధపడుతున్న బాలుడికి అతడి తల్లిదండ్రులు రెండున్నరేళ్లుగా నగరంలోని ఓ బ్లడ్‌ బ్యాంకులో 15 రోజులకు ఒకసారి రక్తమార్పిడి చేయిస్తున్నారు. గత నెలలో అతడికి రక్తమార్పిడి సమయంలో నిర్వహించిన రక్త పరీక్షలో హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ బ్లడ్‌బ్యాంక్‌పై చిన్నారి తల్లిదండ్రులు నల్లకుంట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 338 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నల్లకుంట సీఐ ఎం.రవి తెలిపారు. మరోవైపు తమ వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదని బ్లడ్‌బ్యాంక్‌ నిర్వాహకులు చెబుతున్నారు. గత రెండున్నరేళ్లుగా రక్త దానం చేసే వారి రికార్డులు తమ వద్ద ఉన్నాయని, పోలీసులకు అన్నీ సమర్పిస్తామని తెలిపారు.