Home Page SliderTelangana

బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్..కొనసాగుతున్న రాజీనామాల పర్వం

Share with

అధికార బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామాలతో షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. పార్టీ టికెట్లు ఆశించి, రానివారు పార్టీకి రాజీనామాలు ఇస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ నేత నీలం మధు పార్టీకి రాజీనామా చేశారు. పఠాను చెరువు సీటు కావాలంటూ డిమాండ్ చేసిన ఆయనకు బదులుగా సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి బీఫామ్ లభించింది. ఈ నెల 16 వరకూ గడువు పెట్టిన మధు.. పార్టీ నాయకత్వం స్పందించకపోతే పార్టీని వీడుతానని ప్రకటించారు. అన్నట్లు గానే నేడు రాజీనామా చేశారు. ముదిరాజ్‌లకు పార్టీలో సముచిత న్యాయం దక్కడం లేదని ఆందోళన చెందుతున్నారు. పఠాన్ చెరువు నుండే పోటీ చేస్తానని, ఇక్కడ అహంకారం కావాలో, ఆత్మగౌరవం కావాలో ప్రజలు తేల్చుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. తన స్వగ్రామం కొత్తపల్లి నుండి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.