Andhra PradeshHome Page Slider

నేడు చంద్రబాబు ఐఆర్ఆర్ కేసుపై విచారణ  

Share with

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబుపై మరో రెండు కేసులు కూడా నమోదయ్యాయి. కాగా చంద్రబాబు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్,ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కాగా ఇదే కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌పై హైకోర్టు స్టే విధించింది. అయితే ఈ గడువు నేటితో ముగియనుంది. దీంతో ఈ కేసుపై వాదనలు జరిగే అవాకాశాలు కన్పిస్తున్నాయి. మరికాసేపట్లో ఈ పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం విచారణ ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గతకొన్ని రోజులుగా ఈ కేసుపై విచారణను వాయిదా వేస్తున్న హైకోర్టు ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.