ముగిసిన ఎస్‌ఐ కాంపిటీటివ్ ఎగ్జామ్
కర్నూలు నేర విభాగం: ఎస్‌ఐ, ఆర్ఎస్‌ఐ నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్షల ప్రక్రియ పుర్తైంది. కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ పర్యవేక్షణలో రెండో రోజైన ఆదివారం కర్నూలులోని 14 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉ.10 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-3 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-4 పరీక్ష జరిగింది. 8,521 మంది అభ్యర్థులకు గాను 8,392 మంది హాజరయ్యారు. మొదటి రోజు 125 మంది గైర్హాజరు కాగా.. రెండో రోజు 129 మంది హాజరు కాలేదు. డీఐజీతో పాటు కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్, నంద్యాల ఎస్పీ కె.రఘువీరారెడ్డి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పోలీసు బందోబస్తు నడుమ పరీక్షా పత్రాలను కాకినాడ జేఎన్టీయూకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.