Andhra PradeshNews AlertTelangana

నాతో జాగ్రత్త..అంటున్న కేఏ పాల్

Share with

భూప్రపంచంలో దేవుడికి తప్ప ఎవరికి భయపడనని,ప్రజలందరి గుండెల్లోనే ఉంటానని కే.ఏ.పాల్ మీడియాకు తెలిపారు. ఆయన కేసీఆర్ గురించి మాట్లాడుతూ..కేసీఆర్ “నువ్వు నీ కొడుకుని అదుపులో పెట్టుకో..నీ ఒంట్లో భయం పెట్టుకో” అని హెచ్చరించారు. తాను తెలంగాణకు కాబోయే సీఎం అని ఆ విషయం అందరికీ తెలుసన్నారు. అంతేకాకుండా తాను శపిస్తే కేసీఆర్ నాశనం అవుతారన్నారు.

అనంతరం ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ తనను ఆయన పార్టీలోనికి ఆహ్వానిస్తే పవన్‌ను సీఎం చేస్తానని, తనతో కలవకపోతే పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేడన్నారు. తమ్ముడు  పవన్ కళ్యాణ్ తనతో కలవడం లేదని..కలిస్తే తన పార్టీలో బీసీ,కాపు,దళిత మహిళలకు అవకాశం కల్పిస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు.

ఏపీలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు..స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు.మరి ఏ మంచి పని చేసాడని చంద్రబాబుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. రాయలసీమను దోచుకునే దొంగలు అందరూ పొలిటికల్ నాయకులేనన్నారు. ఇప్పటివరకు సీఎంగా చేసిన వారందరూ రాయలసీమ వాసులేనని చెప్పారు. ఈ రాజకీయ నాయకులందరు రాయలసీమను రాక్షస సీమగా మార్చారన్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా వాడని… వైఎస్ఆర్, జగన్ ఇద్దరు కడప జిల్లాకు చెందినవారన్నారు. కాబట్టే అక్రమాలు, కుటుంబ-కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కమ్మవాళ్ళు తనకు సపోర్ట్ చేస్తున్నారన్నారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు.

గతవారం రోజులుగా కొందరు తనపై లేనిపోని కథనాలు సృష్టిస్తున్నారని… దీనిలో భాగంగానే  వెహికల్స్ బిల్లు కట్టలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన బి ఫార్మ్స్ దొంగలించారని, శపిస్తే చంద్రబాబు నాశనం అయిపోతారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు టీడీపీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేస్తే.. ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని ఆయన చంద్రబాబుకు సూచించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ముందు తిరుపతికి వచ్చి స్వామి వారి పాదాల  వద్ద హామీలు ఇచ్చారని.. ఎన్నికల అనంతరం స్వామి వారినే మోసగించారన్నారు. ఈ విధంగా పాలకులు ప్రజలను మోసగించి ఏపీని సుడాన్,శ్రీలంక, నైజీరియాలా చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ తనకు 120సార్లు పూల మాల వేశారని,చంద్రబాబు,కేసీఆర్ ఇతర రాజకీయ ప్రముఖులు తనకు పాదపూజ చేసారన్నారు.