తెలంగాణ భాషకు అండగా కవిత
హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదంపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ను ఉద్దేశించి కొందరు సోషల్ మీడియాలో తెలంగాణ యాసను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె ఖండించారు.
తెలంగాణ భాష, సంస్కృతి, అస్తిత్వాన్ని అవమానిస్తే సహించబోమని హెచ్చరించిన కవిత, ఈ అంశంపై ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర భాష, సంస్కృతిపై గౌరవం లేదని విమర్శించారు.
ఉప్పల్‌లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, బీఆర్ఎస్‌లోని ఓ నేత ఆంధ్రా కార్పొరేట్ శక్తులతో లోపాయికారీ వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ‘ఇడుపు కాయితం’ అనే పదానికి అర్థం పవన్ కల్యాణ్‌ను అడిగితే చెబుతారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 250 గజాల స్థలం కోసం జులై 2న ఉప్పల్ భగాయత్‌లో భారీ భూపోరాటం నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు. తెలంగాణ సంస్కృతి, అస్తిత్వ పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.

