పశ్చిమ బెంగాల్ కేబినెట్ భారీ విస్తరణ.. కొత్తగా 35 మందికి చోటు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కేబినెట్‌ను భారీగా విస్తరిస్తూ, కొత్తగా 35 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్‌లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్. రవి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ఈ మంత్రిమండలి విస్తరణతో మొత్తం మంత్రుల సంఖ్య 41కి చేరింది. తాజా విస్తరణలో ప్రాంతీయ, సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు.
ఉత్తర బెంగాల్‌తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన సీనియర్ నేతలకు చోటు కల్పించారు. ముగ్గురు హిందీ మాట్లాడే ఎమ్మెల్యేలతో పాటు, పలువురు మహిళా నాయకులకు కేబినెట్‌లో స్థానం లభించింది. ఇటీవల పార్టీ మారిన కొందరు నేతలకు, అలాగే కొత్త ముఖాలకు కూడా ఈ విస్తరణలో ప్రాధాన్యత దక్కింది.
కొత్తగా ఏర్పడిన పూర్తిస్థాయి మంత్రిమండలితో బెంగాల్ ప్రభుత్వ పాలన మరింత వేగవంతం కానుంది.

