Home Page SliderNationalNews AlertSports

వరల్డ్ కప్ హీరోకు ఐపీఎల్ కష్టాలు

టీ20 ప్రపంచకప్‌ లో విధ్వంసం సృష్టించిన ఇంగ్లాండ్ యువ బ్యాటర్ జేకబ్ బెతెల్, ప్రస్తుతం ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో బెంచ్‌ కే పరిమితమవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ బెతెల్ వృధాగా కాలం గడుపుతున్నాడని అసహనం వ్యక్తం చేశాడు. సిడ్నీలో బౌలర్ల అటాక్‌ను ఎదుర్కొన్న తీరు చూస్తే అతను టాప్ ఆర్డర్‌లో ఉండాలి. కానీ ఐపీఎల్‌లో అతనికి ఆడే అవకాశం రావడం లేదు. అక్కడ ఖాళీగా కూర్చోవడం కంటే, స్వదేశానికి తిరిగి వచ్చి వర్విక్‌ షైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడితే మంచిది” అని కుక్ సూచించాడు. టెస్టు క్రికెట్‌కు సిద్ధమవ్వాలంటే కౌంటీల్లో ఆడటం బెతెల్‌కు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, కుక్ వ్యాఖ్యలను మరో మాజీ స్టార్ కేవిన్ పీటర్సన్ తప్పుబట్టారు. “ఐపీఎల్ వాతావరణంలో ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఉండటం వల్ల వచ్చే అనుభవం కుక్ కు తెలియదు. బెతెల్ ఆడకపోయినా, అక్కడ నేర్చుకునే విషయాలు అతన్ని మెరుగైన ఆటగాడిగా మారుస్తాయి. ఇండియాలోనే ఉండు జేకబ్!” అని పీటర్సన్ సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపాడు. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ జోడీ ఓపెనర్లుగా నిలకడగా రాణిస్తుండటంతో, బెతెల్‌కు ప్రస్తుతానికి తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది.