నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం సృష్టించింది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ ఆరేళ్ల బాలుణ్ణి ఆనారోగ్య పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.వైద్య పరీక్షలు చేసినా వైరస్‌ని సరిగ్గా గుర్తించలేకపోయారు.దీంతో పదే పదే వరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో దీన్ని జికా వైరస్ గా గుర్తించారు. మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నైకి తరలించారు.బాలుడు జికా వైరస్ తో బాధపడుతున్నాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలను అలెర్ట్ చేశారు.

