Andhra PradeshHome Page SliderNews AlertPolitics

వైసీపీ ఎంపీకి హైకోర్టులో చుక్కెదురు

రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు ఆ పిటిషన్ పై కీలక నిర్ణయం తీసుకున్న ధర్మాసనం.. మిథున్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను డిస్మిస్ చేసింది. మద్యం కుంభకోణం విచారణ కీలక దశలో ఉన్నందున ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీంతో త్వరలో ఈ కేసులో మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.