పహల్గామ్ ఉగ్రదాడిపై వైఎస్ షర్మిలా రియాక్షన్
పహల్గామ్ ఉగ్రదాడిని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా తీవ్రంగా ఖండించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది దేశం మీద జరిగిన దాడి అన్నారు. ఓ వైపు టూరిస్టులు చనిపోతుంటే సైన్యం ఎందుకు రాలేదు..? పహల్గామ్ ఉగ్రదాడి ముమ్మాటికీ భద్రతా వైఫల్యమేనని స్పష్టంగా తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ ను రాజకీయ శత్రువుల కోసం కేంద్రం వాడుతోందని అనుమానాలు వ్యక్తం మవుతున్నాయని షర్మిలా తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులు ఎవరు..? అని కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.