ట్యాంక్‌బండ్‌లో ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల అరెస్ట్…
హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ.. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు అనుమతి లేదంటూ ఆమెను అడ్డుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు దీక్షలో కూర్చున్న షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పదే పదే తప్పు చేస్తున్నారన్నారు. ఆయన పతనానికి ఇదే నాంది అని అన్నారు.