Andhra PradeshHome Page Slider

తన బలమేంటో తేల్చి చెప్పిన వైఎస్ జగన్

వైఎస్సార్ పింఛన్ కానుకను రూ. 2500 నుంచి రూ. 2750 రూపాయలకు పెంచిన సందర్భంగా రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ పేదోడి బాగు కోసం పనిచేస్తున్నానన్నారు. గజదొంగల ముఠా ప్రజలను మోసం చేయాలని చూస్తోందని చంద్రబాబు అండ్ కోపై నిప్పులు చెరిగారు. గతంలో బటన్లు లేవని… దోచుకో.. పంచుకో.. తినుకో అంటూ ప్రజలను వంచించారని ఎద్దేవా చేశారు. మళ్లీ చంద్రబాబును అధికారంలోకి తేవడానికి దుష్టచతుష్టయం ప్రయత్నిస్తోందన్నారు. తనకు వారెవరి మద్దతు లేకున్నప్పటికీ… దేవుడి దయ, ప్రజల ఆశీస్సులున్నాయని జగన్ చెప్పుకొచ్చారు.

2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ఏం చేశాడో చూశామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రతి నిర్ణయంలోనూ చంద్రబాబు మోసం చేశాడి.. మళ్లీ అది చేస్తా.. ఇది చేస్తానంటూ వంచించేందుకు ప్రజల్లోకి వస్తున్నారని… విమర్శించారు. కందుకూరు, గుంటూరు జిల్లాలో ప్రజల మరణాలకు కారణం ముమ్మాటికి చంద్రబాబేనని దుయ్యబట్టారు. నాడు రైతుల రుణాలు మాఫీ చేస్తానని నట్టేట ముంచారన్నారు. బ్యాంకుల్లో బంగారు ఇంటికి రావాలంటే బాబు రావాలని చెప్పి.. చివరకు మోసం చేశారన్నారు. పొదుపు రుణాల మాఫీ ఎగ్గొట్టిన బాబు… సున్నా వడ్డీ కూడా ఇవ్వలేదన్నారు. 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదని ఆక్షేపించారు. జాబు రావాలంటే బాబు రావాలని చెప్పి… కనీసం 2 వేల నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక నిరుద్యోగ యువకులను మోసం చేశారన్నారు. 2014- 2019 కాలంలో 650 పేజీల మేనిఫెస్టో చూపించి.. ప్రతి కులానికి ఇది చేస్తానని చెప్పి… రంగుల మేనిఫెస్టోతో చీట్ చేశారన్నారు. మేనిఫెస్టో వెబ్‌సైట్‌లో తీసేశారన్నారు. చంద్రబాబు అధికారం కోసం ఏదైనా చేస్తారంటూ దుయ్యబట్టారు.

ఓవైపు చంద్రబాబుపై నిప్పులు చెరిగిన తాను… ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం కట్టుబడి ఉన్నానన్నారు. తాను ఎవరిని నమ్ముకున్నానో అన్న విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు వైఎస్ జగన్. ఒక ఎస్సీ, ఒక ఎస్టీని, ఒక బీసీని, ఒక మైనార్టీని నమ్ముకున్నానంటూ తేల్చి చెప్పారు. తాను పేదవర్గాలను నమ్ముకున్నానన్నారు. రాష్ట్రాల మధ్య జరుగుతోంది కులాల మధ్య యుద్ధం కాదని.. క్లాస్ యుద్ధమన్నారు. పేదవాడు, పెత్తందారి మధ్య యుద్ధం జరుగుతోందన్న జగన్… పొరపాటు జరిగిందంటే పేదవాడు నాశనం అవుతారన్నారు. పేదవాడికి ఇంగ్లిష్ మీడియం చదువు వద్దంటున్నారని… పేదోడికి ఇళ్లు కట్టొంచవద్దంటున్నారు… పేదోడికి సాయం చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ వంచన చేస్తున్నారన్నారు. పేదవాడికి మేలు చేయొద్దంటున్నవారితో జగన్ పోరాడుతున్నాడని.. ప్రజలు అండగా నిలవాలని జగన్ కోరారు. ప్రజలు మద్దతు ఉంటే.. ఇంతకంటే మేలు చేస్తానని భరోసా ఇచ్చారు.