అరటితోటలో వైఎస్ జగన్
వైయస్సార్ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురుగాలులు, అకాల వర్షాలతో నష్టపోయన పంటలను మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు.తాతిరెడ్డిపల్లె, కోమన్నూతలలో పర్యటించిన వైయస్ జగన్… అక్కడ కూలిన అరటితోటలు పరిశీలించారు. ఆ రైతులతో మాట్లాడి, వారికి జరిగిన నష్టాన్ని ఆరా తీశారు.లింగాల మండలంలో ఈదురు గాలులు, అకాల వర్షాలతో దాదాపు 4 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే, పంటలకు సంబంధించి 2023–24 ప్రీమియమ్ కట్టకపోవడంతో ఖరీఫ్ రైతులు నష్టపోయారని జగన్ ఆరోపించారు. ఆ తర్వాత 2024–25కు సంబంధించిన ప్రీమియమ్ కూడా ఆయన కట్టలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జగన్ కోరారు. తక్షణమే రైతన్నలకు ఇన్ పుట్ సబ్సిడి,రుణాలు మంజూరు చేయాలని, పంట నష్ట నివారణ అంచనా వేసి సాయం పంపిణీ చేయాలని కోరారు.