ఉగ్రదాడికి ముందు పహల్గాంలో పర్యటించిన యూట్యూబర్
గూఢచర్యం కేసులో అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి మూడు నెలల ముందు ఆమె పహల్గాం వెళ్లినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. అలాగే పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఆ దేశ హైకమీషన్ ఉద్యోగి దానిష్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నట్లు తేలింది. ఉగ్రదాడికి మూడు నెలల మందు జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్లి వీడియోలు తీసినట్లు తెలుస్తోంది. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.