మీ వాళ్లు కళాకారులు…మా వాళ్లు తిండిబోతులు
ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ , టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు.గేమ్ ఛేంజర్ ఈ వెంట్ తర్వాత,అదేవిధంగా తెలంగాణలో టికెట్ల పెంపుకి సీఎం రేవంత్ నో చెప్పిన తర్వాత దిల్ రాజులో అసహనం ఆకాశానికి చేరింది అనే విధంగా ఆయన వ్యాఖ్యలున్నాయి.నిజామాబాద్‌లో నిర్వహించిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రులు కళాకారులని, ఆంధ్రాలో ఎక్కడ ఎలాంటి ఈవెంట్‌లు పెట్టినా లక్షలాది గా తరలి వస్తారని ,అదే తెలంగాణలో అయితే కల్లు కుండ,మటన్ ముక్కల కోసం ఎగబడతారే తప్ప ఇలాంటి ఈవెంట్లకు రారంటూ సరదాగా వ్యాఖ్యానించారు.ఆయన సరదా అన్నప్పటికీ తెలంగాణ కళాకారులు మాత్రం దిల్ రాజు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ బిడ్డగా పుట్టి ఇలా ఆంధ్రులని ఆకాశానికి ఎత్తేసి తెలంగాణ బిడ్డలను కించపరుస్తాడా అంటూ మండిపడుతున్నారు.దిల్ రాజు తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.