అలిపిరిలో కిస్సిక్ సాంగ్ పై యువతి డ్యాన్స్.. వీడియో వైరల్
అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఓ పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ కు మోడ్రన్ దుస్తుల్లో ఓ యువతి రీల్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కలియుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుమల కొండ ప్రవేశ మార్గంలో పుష్ప-2 చిత్రంలోని కిస్సిక్ సాంగ్ కు డ్యాన్స్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అలిపిరి టోల్ గేట్ ముందు డ్యాన్స్ చేసిన వీడియోను యువతి తన ఇన్స్ టా పోస్టు చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని ఫైర్ అయ్యారు. ఇలాంటి వారి పట్ల టీటీడీ కఠినంగా వ్యవహరించాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భక్తుల నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు రావడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం స్పందించింది. యువతిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. అయితే, విషయం తెలుసుకున్న యువతి.. మరో వీడియోలో శ్రీవారి భక్తులు తనను క్షమించాలంటూ కోరింది.