Home Page Sliderhome page sliderNational

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు తగ్గడంతో యువతి ఆత్మహత్య..!

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తగ్గారని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ అనే యువతి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన యూపీలోని లక్నోలో జరిగింది. తన 25వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు లక్నోలో మిషా ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె కుటుంబం వెల్లడించింది. మిషా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య తగ్గడం వల్ల తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్‌లో ఉందని మిషా సోదరి ముక్తా అగర్వాల్ తెలిపింది.