హైదరాబాద్ లోని మాదాపూర్ లో యువకుడు దారుణ హత్య
మాదాపూర్ లో దారుణం జరిగింది. మాదాపూర్ యశోద ఆస్పత్రి వెనుక తన తల్లి బర్త్ డే సందర్భంగా జయంత్ గౌడ్ అనే యువకుడు ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చాడు. స్నేహితులతో కలిసి మందు తాగుతుండగా బంగారం, డబ్బులు ఇవ్వాలని ముగ్గురు దుండగులు బెదిరించారు. గొడవకు దిగిన జయంత్ గౌడ్ పై విచక్షణరహితంగా కత్తులతో దాడి చేశారు. దుండగుల దాడిలో యువకుడు జయంత్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


 
							 
							