Home Page SliderTelangana

నేను నోరు విప్పితే మీరు తట్టుకోలేరు..

మూసీపై బీఆర్ఎస్ ప్రణాళిక చేస్తే తాను వద్దని కూడా చెప్పానని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఆనాటి విషయాలు ఇప్పుడు బయటకు చెప్పమంటారా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. నేను నోరు విప్పితే ఇబ్బంది పడేది బీఆర్ఎస్ నాయకులే అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లను కూల్చకుండా ప్రక్షాళన చేస్తే తామూ స్వాగతిస్తామన్నారు. జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడానికి తామే కారణమని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. మజ్లిస్ మద్దతు కారణంగానే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. ఎన్నికల సమయంలో కేవలం 24 మందిని మార్చి ఉంటే బీఆర్ఎస్ గెలిచి ఉండేదని జోస్యం చెప్పారు. కానీ అప్పుడు బీఆర్ఎస్ వాళ్లకు అహంకారం ఉందని ఒవైసీ విమర్శలు గుప్పించారు.