డబ్బులతో రాజకీయాల్లో విజయం సాధించలేం..
కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్ నేతల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ కోసం పోరాడిన అందరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్నారు. కేవలం డబ్బులతోనే రాజకీయాల్లో విజయం సాధించలేమన్నారు. డబ్బుతోనే గెలిచేది ఉంటే.. కేసీఆర్‌కు వంద సీట్లు వచ్చి ఉండేవని చెప్పారు.

