Home Page SlidermoviesNationalNews Alertviral

‘నన్ను భయపెట్టలేరు..నేను క్షమాపణలు చెప్పను’..కమల్ హాసన్

తనను ఎవరూ భయపెట్టి, క్షమాపణలు చెప్పించలేరని, తానేం తప్పులు చేయలేదని ప్రముఖనటుడు కమల్ హాసన్ పేర్కొన్నారు. కన్నడ భాష వివాదంపై కమల్ హాసన్‌ను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ భాషపై తనకు ప్రేమ ఉందని, కొందరు వక్రీకరించి తన మాటలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. తాను తప్పు చేస్తేనే క్షమాపణలు చెప్తానని, ప్రస్తుత వివాదం అంత తీవ్రమైనది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మనది ప్రజాస్వామ్య దేశం, నేను చట్టాన్ని నమ్ముతానని పేర్కొన్నారు.