యడ్యూరప్పకు పోక్సో కేసులో ఊరట
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ లీడర్ యడ్యూరప్పకి పోక్సో కేసులో ఊరట లభించింది. ఆయనను జూన్ 17 వరకూ అరెస్టు చెయ్యొద్దని కర్ణాటక హైకోర్టు సీఐడీ పోలీసులను ఆదేశించింది. ఆయనకు నిన్న 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితునిగా పేర్కొంటూ బెంగళూరు ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా ఆయనకు ఊరట లభించింది. ఆయన జీవిత చివరిరోజులలో ఉన్నారని, అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టు తెలియజేసింది.