Home Page SliderHoroscope TodayNewsTelangana

మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ వక్రీకరణ – మంత్రి సత్యకుమార్ ఆగ్రహం

మంగళగిరి‌: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు, ప్యానలిస్టుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని BJP రాష్ట్ర అధ్యక్షుడు దండు మాధవ్ మరియు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ, కులవివక్షత నిర్మూలన కోసం పార్టీ తరఫున ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. “సంజీవని స్వరం” పేరుతో ఈ కార్యక్రమాన్ని తిరుపతి నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పే దిశగా ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు.

అంతేకాక, కూటమి ప్రభుత్వం చేపట్టిన పీపీపీ (PPP) విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైఎస్సార్సీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలను బీజేపీ తిప్పికొడుతుందని, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు.

కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, ప్రతినిధులు, ప్యానలిస్టులు పాల్గొన్నారు.