వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్టు!
•ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
•భారీగా మోహరించిన పోలీసులు
నెల్లూరు రూరల్ పరిధిలో పొట్టేపాలెం కలుజు రిపేర్లు కోసం నిరసన తెలుపుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురువారం జలదీక్షకు దిగారు. ఐతే దీక్షకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దీక్ష చేపట్టకుండా తెల్లవారుజామునే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. సమాచారం అందుకున్న అభిమానులు, కార్యకర్తలు ఆయన నివాసానికి భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. దీంతో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.
