Andhra PradeshHome Page Slider

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

Share with

చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై గతకొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. కాగా ఈ రోజు కూడా చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.అయితే  ఈ కేసులో విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ నెల 17న మంగళవారం మధ్యహ్నం 2 గంటలకు ఈ కేసును విచారణ చేస్తామని న్యాయమూర్తులు వెల్లడించారు. ఇవాళ సీఐడీ తరుపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు కేసులో నేరం జరిగి 5 ఏళ్లు అయినా ఇప్పటికీ FIR నమోదు చేయలేదన్న చంద్రబాబు తరుపు న్యాయవాది వాదనలను ఆయన తిప్పికొట్టారు. కాగా నేరం 5 ఏళ్ల కిందట జరిగినా ఇప్పుడు FIR నమోదు చెయ్యొచ్చని చెప్పారు. అనంతరం చంద్రబాబు కేసులో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సెక్షన్ 17A అనేది అవినీతికి రక్షణ కాకుడదని ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు.