త్వరలో చానెల్ పెడుతున్నా- వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను త్వరలో ఒక మీడియా హౌస్ ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. గతంలో రెండున్నరేళ్ల క్రితం రామోజీరావుపై కోపంతో చానెల్ పెట్టాలనుకున్నానన్న విజయసాయిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో ఆ ఆలోచన ఉపంసహరించుకున్నానన్నారు. చానెల్ పెడితే లాస్ అవుతావని జగన్ చెప్పారని, కానీ ఇప్పుడు మాత్రం తాను ఎవరి మాట వినబోనన్నారు. త్వరలో చానెల్ స్టార్ట్ చేస్తానన్నారు. దేనికీ పనికిరాని వాళ్లు చానెళ్లు స్టార్ట్ చేయంగా లేనిది, ఒక ఎంపీగా ఉండి, సమాజంలో పలుకుబడి ఉండి, మంచి చేయాలని ఉన్న, తాను చానెల్ పెట్టకపోతే ఎలా అన్పిస్తోందన్నారు విజయసాయిరెడ్డి. ఇన్నాళ్లూ చానెల్ ఎందుకు పెట్టలేదని కాలయాపన చేశానని బాధకలుగుతుందన్నారు. ఈసారి ఎవరు చెప్పినా వినబోనన్నారు. మీడియా ముసుగులో చేస్తున్న దుశ్చర్యలకు తాను బదులిస్తానన్నారు. కుల చానెల్స్, కుల పత్రికలు అందరినీ ఎండగడతానన్నారు విజయసాయిరెడ్డి. త్వరలో చానెల్ ప్రారంభిస్తానన్నారు. చాలా న్యూట్రల్‌గా చానెల్ ఉంటుందని, కులాలకు, మతాలకు, రాజకీయ పక్షాలకు అతీతంగా ఉంటుందన్నారు. న్యూట్రాలిటీ అంటే న్యూట్రాలిటీనన్నారు. విజయసాయిరెడ్డి ఏ రాజకీయపక్షంలో ఉన్నప్పటికీ చానెల్ మాత్రం న్యూట్రల్ గా ఉంటుందన్నారు.

