అఖిల పక్ష భేటీకి హాజరుకానున్న వైసీపీ ఎంపీ
మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లపై కేంద్రం ఇవాళ ఢిల్లీలో అఖిలపక్ష భేటి నిర్వహిస్తుంది. అయితే ఈ అఖిలపక్ష భేటీకి తాము హాజరవుతున్నామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. మణిపూర్ ప్రజలు ఈ అల్లర్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అయితే ఈ అల్లర్లను సామరస్యంగా పరిష్కరించడానికి ప్రధాని మేదీ,హోంమంత్రి అమిత్ షా కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అయితే అల్లర్లను పరిష్కరించేందుకు వారు చేస్తున్న కృషికి తాము మద్దతు తెలపడానికే ఈ అఖిలపక్ష భేటీలో పాల్గొననున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఎంపీ విజయసాయి రెడ్డి ఈ అఖిలపక్ష భేటీకి తాను హాజరవుతున్నట్లు తాజాగా ట్వీట్ చేశారు. అయితే ఈ అఖిలపక్ష భేటీకి మెజార్టీ విపక్షాలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

