“వైసీపీ నేతలు మమ్మల్ని బెదిరించారు”: మాజీ వాలంటీర్లు
ఏపీలో మాజీ వాలంటీర్లు సీఎం చంద్రబాబుకు తమ వినతులు తెలియజేస్తున్నారు. కాగా వైసీపీ నాయకుల ఒత్తిడితోనే తాము ఎన్నికల ముందు రాజీనామాలు చేశామన్నారు. అయితే ఇప్పుడు తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు రాజీనామా చేయకపోతే మళ్లీ మేం వచ్చాక తీసేస్తామంటూ వైసీపీ నేతలు బెదిరించారని వారు వాపోయారు. వైసీపీ ప్రభుత్వంలో రూ.5000/-లకు వెట్టి చాకిరి చేశామన్నారు. అయితే ఏ ఉద్యోగం లేకపోవడంతోనే దీంట్లో చేరామని వాలంటీర్లు తెలిపారు. కాగా దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని సీఎం చంద్రబాబును కోరుతున్నామన్నారు. అంతేకాకుండా తాము ఏ పార్టీకి చెందిన వాళ్లం కాదని మాజీ వాలంటీర్లు స్పష్టం చేశారు.