నారా లోకేశ్‌కు వైసీపీ నేత అనిల్ సవాల్
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. కాగా ఏపీలోని నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ నారా లోకేశ్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఇటీవల కాలంలో నెల్లూరులో నాపై పోటీ చేసి లోకేష్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అనిల్ లోకేశ్‌కు సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన నారా లోకేశ్ నిన్న అనిల్ కుమార్ అక్రమ ఆస్తుల చిట్టాను మీడియా ముందు ప్రవేశపెట్టారు. దీంతో ఇద్దరి మధ్య వార్ పీక్స్‌కు చేరినట్లు కన్పిస్తోంది. అయితే ఈ ఆరోపణలను అనిల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. కాగా అనిల్ కుమార్ మాట్లాడుతూ..ఈ ఆరోపణల్లో నిజం లేదని ప్రమాణం చేయడానికి తాను సిద్ధమన్నారు. ఈ నేపథ్యంలో లేకేశ్ కూడా వచ్చి ప్రమాణం చేయాలని అనిల్ సవాల్ విసిరారు. దీంతో ఈ ప్రమాణాల ఛాలెంజ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే మరి నారా లోకేశ్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సివుంది.

