వైసీపీ నేత అరెస్ట్..
ఏపీలోని కడపకు చెందిన వైసీపీ కీలక నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా అరెస్టు సంచలనం రేపింది. కువైట్ వెళ్లేందుకు ముంబయి ఎయిర్ పోర్టు చేరుకున్న ఆయనను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప పోలీసులకు అప్పగించారు. 2022లో కడపలో జరిగిన స్థల వివాదంలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తిపై అహ్మద్ బాషా దాడి చేశారని ఆయనపై కేసు నమోదయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన దుబాయ్‌లో ఉంటున్నట్లు సమాచారం. ఇటీవల రంజాన్ పండుగ సందర్భంగా కడపకు వచ్చారని, తిరిగి వెళ్లేందుకు ముంబయి చేరుకోగా లుకౌట్ నోటీసు ఉన్నందువల్ల ఆయనను అరెస్టు చేశారు. గతంలో కూడా టీడీపీ నాయకులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఆయనపై కేసులు నమోదయ్యాయి.

