Andhra PradeshHome Page Slider

“వైసీపీ మనకు శత్రువు కాదు..ప్రత్యర్థి మాత్రమే”:పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసైనికులకు కీలక సూచనలు చేశారు.కాగా వైసీపీ మనకు శత్రువు కాదని,ప్రత్యర్థి మాత్రమేనని పవన్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని జనసైనికులు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. పవన్ మాట్లాడుతూ..వైసీపీ నేతలను కక్షపూరితంగా వేధించొద్దు అన్నారు. సోషల్ మీడియాలో కూడా వారిపై నిందలు వేయొద్దన్నారు. వ్యక్తిగత దూషణలు చేయొద్దని పవన్ జనసైనికులకు పిలుపునిచ్చారు. వైసీపీ వాళ్లు ఏ తప్పులు చేశారో మనం వాటిని చేయకూడదన్నారు. అలా అని మనం చేతులు కట్టుకొని ఉండొద్దన్నారు. కాగా వాళ్లు తప్పులు చేసి ఉంటే వారికి చట్టప్రకారం శిక్ష పడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.