Andhra PradeshHome Page Slider

ఏపీలో హింసపై మీడియాకు వైసీపీ ఎగ్జిబిషన్

ఏపీలో వైసీపీ కార్యకర్తలపై హింసాత్మక సంఘటనలు పెరిగిపోతున్నాయని, వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద రేపు బుధవారం ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ నిర్వహించబోతున్నామని వైసీపీ ప్రకటించింది. దీనికోసం మీడియాను ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్‌లో దాడులు, హత్యలు,శాంతిభద్రతలకు రక్షణ లేకపోవడం వంటి విషయాలను ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. వైసీపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు జగన్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.