టిటిడి తరహాలో ఇక యాదగిరి టెంపుల్ బోర్డు
దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ నృశింహ క్షేత్రమైన యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కూడా ఇక నుంచి టెంపుల్ బోర్డు ఉండబోతుంది .ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అధికారులకు ఆదేశాలిచ్చారు.టిటిడి తరహాలో యాదగిరి గుట్ట ఆలయానికి కూడా టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు.దీనికి సంబంధించిన కసరత్తు పూర్తిచేసి తనకు నివేదిక ఇవ్వాలని కోరారు.అదేవిధంగా ఇక నుంచి యాదాద్రి అని కాకుండా యాదగిరిగుట్ట అని రికార్డుల్లో పేరు మార్పు చేయాలని చెప్పారు.

