ఎక్స్ (ట్విటర్ ) సేవలకు అంతరాయం..
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్(ట్విటర్) సేవలు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. అనేక చోట్ల ఈ సేవలకు అంతరాయం కలుగుతోందని పలువురు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సైట్ ఓపెన్ కావట్లేదని కొందరు, ఓపెన్ అయినా లాగిన్ కాలేకపోతున్నామని కొందరు పోస్టులు పెడుతున్నారు. గంట నుండి ఎక్స్ పనిచేయడం లేదని యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఎక్స్ ఇంకా అఫీషియల్‌గా ఈ విషయంపై ఎలాంటి వార్త విడుదల చేయలేదు.
]