“దేవర” సాంగ్‌పై రచయిత పోస్ట్ వైరల్…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” పై పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు సాలిడ్ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి వస్తున్న ఒకో అప్‌డేట్ మరిన్ని అంచనాలు పెంచుతూ వెళుతోంది. ఈ చిత్రం నుంచి మేకర్స్ నిన్ననే రెండో సాంగ్‌పై కూడా క్రేజీ పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అందించారు. అయితే అనిరుధ్ అందిస్తున్న ఈ సినిమా ఆల్బమ్‌పై మాత్రం గట్టి హైప్ ఇప్పుడు జెనరేట్ అవుతోంది. అలా ఇప్పుడు రానున్న రెండో సాంగ్‌పై ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పోస్ట్ ఇపుడు వైరల్‌గా మారింది.
ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఈ ట్వీట్ గుర్తుంచుకోండి మళ్ళీ మాట్లాడదాం అంటూ గట్టి నమ్మకాన్ని అయితే అభిమానులకి ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ సాంగ్ పట్ల మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయ్. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోందని కానున్న సంగతి తెలిసిందే.

