స్టెప్పులేసిన ప్రపంచ సుందరీమణులు
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ 50 మంది సుందరీమణులు వివిధ దేశాల నుండి విచ్చేశారు. వారికి రాష్ట్ర పర్యాటక శాఖ ఘనంగా స్వాగతం పలికింది. ఈ నేపథ్యంలో వారు కూడా నృత్యకారులతో పాటు సంతోషంగా స్టెప్పులేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 116 దేశాల నుండి యువతులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు. ఈ నెల 10వ తేదీ నుండి 31 వ తేదీ వరకూ పోటీలు జరగనున్నాయి. వీరు హైదరాబాద్ పాతబస్తీని సందర్శించి చార్ మినార్ వద్ద హెరిటేజ్ వాక్ చేయనున్నారు. లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్‌లను కూడా సందర్శిస్తారు. తెలంగాణ తల్లి, సెక్రటేరియట్ కూడా దర్శిస్తారు. వారికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
