నెక్లెస్ రోడ్‌లో సందడిగా ‘వరల్డ్ బైసికిల్ డే’
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ సైకిల్ రైడ్ సందడిగా మారింది. వరల్డ్ బైసికిల్ డేను పురస్కరించు కొని ఆదివారం సాగర తీరంలోని 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ మీదుగా సైకిల్ రైడ్ నిర్వ హించారు. ప్రతి ఏడాది జూన్ 3న వరల్డ్ బై సైకిల్ డే సందర్భంగా ఆదివారం హైదరాబాద్ సైకిలిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో 300 మందితో కలిసి సైకిల్ రైడ్ నిర్వహించారు. ఈ రైడ్‌ను కస్టమ్స్ అండ్ జీఎస్టీ చైర్మన్ నరసింహారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. 8 ఏళ్లుగా బైసికిల్ డే సందర్భంగా గ్రామీణ పేద విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తున్నామని, ఈసారి కూడా 15 సైకిళ్లు అందజేశామని హైదరాబాద్ సైకిలిస్ట్ గ్రూప్ ఫౌండర్ రవీందర్ నందనూరి తెలిపారు. దుండిగల్ తండా ప్రాంతంలోని విద్యార్థినులకు 10, మెహిదీపట్నం ప్రాంతంలోని పాఠశాల విద్యార్థినులకు 5 సైకిళ్లు, సూర్యాపేటలకు చెందిన వారికి రెండు ట్రై సైకిల్స్ అందజేశామని తెలిపారు.

