సింధూ జలాలపై స్పందించిన ప్రపంచబ్యాంక్
భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో ముఖ్యమైనది సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం. అయితే ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంక్ సమక్షంలో జరిగిందని, అందుకే దీనిపై అప్పీలు చేస్తామని, ప్రపంచబ్యాంక్ మధ్యవర్తిత్వాన్ని తీసుకుంటామని సవాల్ చేసింది పాకిస్తాన్. తాజాగా ఈ విషయంపై ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా స్పందించారు. ఈ విషయంలో ప్రపంచబ్యాంక్ ఎలాంటి జోక్యం చేసుకోలేదని వెల్లడి చేశారు. ఇది ఒక అసిస్టెంట్‌గా మాత్రమే పని చేస్తుందని పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు. దీనితో ఈ విషయంలో ఇక భారత్‌కు పూర్తి స్వేచ్ఛ లభించినట్లే.

